కేటీఆర్ నోటి వెంట డీజే టిల్లు డైలాగ్..‘ అట్లుంటది మనతోని’

తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్..డీజే టిల్లు డైలాగ్ చెప్పి అదరగొట్టారు.వరంగల్ పర్యటనలో తెలంగాణ యాస గురించి చెబుతూ…కేటీఆర్ ‘ అట్లుంటది మనతోని’ అని డైలాగ్ చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ డైలాగ్ వీడియో చాలా వైరల్ అవుతోంది. ఒకప్పుడు తెలంగాన యాస అంటే సినిమాల్లో విలన్లకు, కమెడియన్లకు పెట్టే వారని… ప్రస్తుతం ట్రెండ్ మారిందని.. ఇప్పుడు తెలంగాన యాస లేనిదే సినిమాలు రావడం లేదని కేటీఆర్ అన్నారు.

‘ ఇక అట్లుంటది మనతోని’ అనే విధంగా తెలంగాణ యాస సినిమాల్లో వాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. గతంలో సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీ వేదికగా సినిమాల్లో తెలంగాణ యాస లేకుంటే నడవడం లేదని అన్నారు. ఇక నిన్న వరంగల్ లో కేటీఆర్ బిజెపి కి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్న ఆదాయంతోనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వెలుగులు నిండుతున్నాయని కేటీఆర్ అన్నారు.

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అంతా జరుగుతున్నదని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి రూ.3, 65,790 కోట్లు ఇస్తే, కేంద్రం తిరిగి రాష్ర్టానికి ఇచ్చింది రూ.1, 68, 640 కోట్లు మాత్రమేని స్పష్టం చేశారు. ఈ లెక్కలు తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, పదవిని ఎడమ కాలు చెప్పు లెక్క వదులుకొని సాధారణ ఎమ్మెల్యేగా ఉంటానని సవాల్‌ విసిరారు.