బీజేపీ జాబితాపై కాంగ్రెస్ విమర్శలు

bjp

రైతులను కారుతో తొక్కి చంపిన నిందితుడి తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు బీజేపీ టికెట్ ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీని ద్వారా ఆ పార్టీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని విమర్శించింది. కొంతమంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడం వారు అసమర్థ పాలకులుగా మిగిలారనే అర్థం కదా అని ఎద్దేవా చేసింది. ఇద్దరు MPలు తాము పోటీ చేయబోమంటూ ప్రకటించారని, అలాంటి వారు చాలామంది బీజేపీకి దూరమవుతున్నారని పేర్కొంది.

అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోడీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా మొదటి విడత జాబితాలో ప్రస్తుత మోడీ క్యాబినెట్‌లోని 34 మంది మంత్రులకు చోటు దక్కింది. తొలి లిస్టులో 28 మంది మహిళలు, 47 మంది యువ నేతలు ఉన్నారు. అధికంగా యూపీలోని 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలోనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ పోటీ చేయనున్న స్థానాలను ఖరారు చేయడం గమనార్హం. ఇక తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మందిని ఎంపిక చేశారు.