ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్

kcr-warning-to-brs-leaders

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి నేతలతో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తిమీద సాములా మారాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించకుంటే ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. అందుకే గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చూస్తుంది.

ఇదిలా ఉంటె శనివారం బిజెపి 195 మంది తో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుండి 9 మంది పేర్లను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు మరోసారి అవకాశమివ్వడంతో పాటు మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలో నిలిపింది. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బీబీ పాటిల్‌ను జహీరాబాద్‌ అభ్యర్థిగా, నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీ రాములు కుమారుడు పీ భరత్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌, హైదరాబాద్‌ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది.