సీపీఐ-కాంగ్రెస్ పొత్తు పిక్స్

సీపీఐ-కాంగ్రెస్ పొత్తు ఫిక్స్ అయ్యింది.సోమవారం సీపీఐ కార్యాలయానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్సీలకు సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం పొత్తు, ఇతర రాజకీయ అంశాలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించారు.

అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ చేసారు. సీపీఐ కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక సీపీఐ-కాంగ్రెస్‌ మధ్య సమన్వయం కోసం కమిటీ వేస్తామని ప్రకటించారు రేవంత్‌ రెడ్డి. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు తెలిపారు. నెల రోజుల కిందట నిశ్చితార్థం అయిందని.. ఇవాళ పెళ్లి ముహూర్తం కుదిరిందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.