నెట్‌ఫ్లిక్స్‌లో వరుణ్ పెళ్లి వేడుక స్ట్రీమింగ్..

నవంబర్ 01 న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల వివాహ వేడుక ఇటలీ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ అంత హాజరై సందడి చేసారు. వారం రోజుల పాటు ఇటలీ లో గడిపిన మెగా ఫ్యామిలీ శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి వీడియోను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకను అభిమానులందరూ చూసేలా ఓటీటీలోకి రానుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ హక్కులను దాదాపు రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ పెళ్లి వేడుకను ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. గతంలోనూ హన్సిక, నయనతార తమ పెళ్లి వీడియోలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.