కర్నూల్ జిల్లాలో ఘోరం : పాఠశాలపైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు

కర్నూల్ జిల్లా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలపై కప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడం తో పిల్లలు ఎంతో ఉత్సహంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. బురాన్ దొడ్డిలో కూడా విద్యార్థులు అలాగే ఉత్సహంగా హాజరయ్యారు.

ఈ క్రమంలో 5 వ తరగతి విద్యార్థుల క్లాస్ రూం సీలింగ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహీధర్ అనే విద్యార్ధి తలకు కుట్లు పడ్డాయి. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. సంఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ సస్పెన్షన్ చేసారు. ఈ ప్రమాద సమాచారాన్ని బయటకు రాకుండా ఉన్నతాధికారులకు చేరకుండా చేసిన సి.బెళగల్ MEO, HM లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు డీఈఓ ను ఆదేశించారు.