వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించిన సీఎం జగన్

అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు

cm-jagan-gives-b-forms-to-ysrcp-mlc-candidates

అమరావతిః ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, నేడు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం జగన్ బి-ఫారాలు అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. పోతుల సునీత, పెన్మత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయెల్, మర్రి రాజశేఖర్ లు సీఎం జగన్ నుంచి బి-ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా, తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నెల 29తో ఏపీలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న అసెంబ్లీ భవనంలో పోలింగ్, అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.