మోడల్ పై నడుస్తున్న కారులో అత్యాచారం

Rape in a running car on a model

Community-verified icon


దేశ వ్యాప్తంగా అత్యాచారాలు అనేవి తగ్గడం లేదు. ప్రతి ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మోడల్ పై నడుస్తున్న కారులో అత్యాచారం జరిగిన ఘటన కొచ్చిలో చోటుచేసుకుంది.

కొచ్చిన్ షిప్ యార్డ్ సమీపంలోని ఓ పబ్ కు వెళ్లిన బాధిత మోడల్, అక్కడ మద్యం సేవించింది. దీన్ని అవకాశంగా భావించిన కొందరు, ఆమెను కక్కనాడ్ లోని తన నివాసం వద్ద దిగబెడతామని చెప్పి కారులోకి ఎక్కించుకున్నారు. రాత్రంతా పట్టణం చుట్టూ తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రూమ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఈ కేసులో ఒక మహిళ సహా మొత్తం నలుగురిని ఎర్నాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మోడల్ ను చికిత్స కోసం కలమసెర్రి మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు గాయాలైనట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగు చూసింది.