కాంగ్రెస్ కు బిగ్ షాక్ : మాజీ మంత్రి బోడ జనార్దన్ రాజీనామా

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బోడ జనార్దన్ పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, పార్టీ లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ..కాంగ్రెస్ లో నేతలు బిఆర్ఎస్ లోకి ..బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వలసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ చేశారు.

బోడ జనార్దన్ మొదటి నుండి చెన్నూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు, కానీ ఇతనికి ఆ టికెట్ దక్కకపోవడంతో ఇక ఈ పార్టీలో ఉండి లాభం లేదనుకుని రాజీనామా లేఖను కాంగ్రెస్ కు పంపించారు. అయితే ఇతనికి బదులుగా కాంగ్రెస్ ఆ టికెట్ ను కనీసం సభ్యత్వం కూడా లేని వివేక్ కు ఇచ్చారన్న కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రేపు మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో జనార్ధన్ గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.