ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం గిఫ్ట్ .. కాంగ్రెస్ హామీ ప్రకటించబోతుందా..?

తెలంగాణ లో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. కర్ణాటక లో ఎలాగైతే విజయం సాధించిందో..తెలంగాణ లో కూడా అలాంటి సంచలన విజయం సాధించాలని చూస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపిన కాంగ్రెస్…ఇప్పుడు మరో కీలక హామీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..మరో అద్భుత హామీపై చర్చించారు.

ఆడపిల్లల పెళ్లికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేలా ఓ సంచలన హామీని ప్రతిపాదించారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ప్రభుత్వ సహాయంతోపాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజముగా ఈ హామీ కానుకగా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటిస్తే..ఇక కాంగ్రెస్ గెలుపుకు తిరుగుండదు. ప్రస్తుతం తెలంగాణ లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పుడు దీనిని మించేలా కాంగ్రెస్ తులం బంగారం పధకం మరింత ఆకట్టుకోవడం ఖాయం.