కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ – మంత్రి కేటీఆర్

గత మూడు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్..ఇప్పుడు మరింత అనారోగ్యానికి గురైనట్లు ఆయన కుమారుడు , మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ మీడియా కు వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని అన్నారు. కాగా, వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మూడు వారాలకుపైగా జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోనే.. యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన ఐదుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. అయితే.. ఇప్పుడు మరో ఇద్దరు నిపుణులు కూడా దగ్గరుండి కేసీఆర్ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు. కాగా.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారం రోజులకు పైగానే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని బీఆర్ ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు.