భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన గోదావరి ఉద్ధృతి

Godavari river

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతుంది. బుధవారం రాత్రి 43 అడుగులకు వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను విరమించారు. అయితే గురువారం ఉదయం 11 గంటలకు 45.8 అడుగులకు వరద ఉద్ధృతి చేరుకోవడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఎగువన ఉన్న ఇంద్రావతి, కాళేశ్వరం, తాలిపేరు, పేరూరు నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడగులకు చేరుకుటుందని కేంద్ర జలసంఘం అంచనావేస్తోంది. వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ రాత్రి నీటిమట్టం 48 అడుగులకు చేరితో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. కాగా, వర్షాల ధాటికి పాల్వంచలోని నాగారం కిన్నెరసాని వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది. దాంతో భద్రాలచం నుంచి చర్ల, వెంకటాపురం, వీఆర్‌పురం, కుక్కునూరు, ఖమ్మం, హైదరాబాద్‌ల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/