తాలిబన్ల కు భారీ దెబ్బ..సీనియర్​ కమాండర్ ను మట్టుపెట్టిన రెసిస్టెన్స్ ఫోర్స్

అఫ్గాన్‌ను ఆక్రమించుకన్న తాలిబన్లు..తాజాగా పంజ్‌షేర్‌ ను వశం చేసుకొని జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ లోపే రెసిస్టెన్స్ ఫోర్స్ తాలిబన్ల కు భారీ షాక్ ఇచ్చారు. తాలిబాన్లకు సీనియర్​ కమాండర్​గా వ్యవహరిస్తున్న ఫసీయుద్దీన్​ మౌల్వీని రెసిస్టెన్స్ ఫోర్స్​ మట్టుబెట్టింది. ఆయనతో పాటు ఉన్న మరో 13 మందిని కూడా హతమార్చినట్లు పంజ్​షేర్​ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటె ఆఫ్గనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా అంతర్గత విభేదాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు కాకుండా మరొకరికి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు తాలిబన్లు నిర్ణయించినట్లు తెలుస్తుంది.