భాగ్యనగరం-జలదిగ్బంధం

విజయవాడ-హైదరాబాద్‌ రాకపోకలు బంద్‌

Heavy Rain
Heavy Rain

హైదరాబాద్‌: ఎడతెరపి లేని వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరం జలదిగ్బంధంలో ఉంది.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

హైదరాబాద్‌లో గరిష్టంగా 2.సెం.మీ వర్షపాతం నమోదైంది.. భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి..

వాతావరణశాఖ రెడ్‌అలర్ట్‌ హైదరాబాద్‌ జారీచేసింది.. అబ్దుల్లాపూర్‌ మెట్టు మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు బంద్‌ అయ్యాయి.. ఆయా మార్గాల్లో వాహనాలతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/