శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో జయం రవి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తమిళ హీరో జయం రవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో జయం రవికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.

ఇక శుక్రవారం ఒక్క రోజే రూ.4.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.నిన్న 62,593 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో 18,517 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు హుండీ కానుకల ద్వారా మొత్తం రూ.4.31 కోట్లు ఆదాయాన్ని అందించారు.