ఏపిలో అక్టోబర్‌ 15న తెరచుకోనున్న కాలేజీలు

ఉన్నత విద్య విధానంపై జగన్‌ సమీక్ష సమావేశం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని సిఎం నిర్ణయించారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 80 శాతానికి తీసుకెళ్లాలని అధికారులకు సిఎం ఆదేశించారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌ సదుపాయం, ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆనర్స్ డిగ్రీ చేపట్టాలన్నారు. సెప్టెంబర్‌లో సెట్‌ పరీక్షలు చేపట్టాలని సూచించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/