యూఏఈలోని మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire breaks out in Ajman market

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవిచింది. అజ్మాన్ ప్రాంతంలోని మార్కెట్లో నిన్న సాయంత్రం 6.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అజ్మాన్ అగ్నిమాపక సిబ్బంది ఈ స్థలాన్ని చుట్టుముట్టారు. నీరు, ఫోమ్‌తో అనేక దుకాణాల్లో మంటలను ఆర్పివేశారు. ఎమిరేట్ కొత్త పారిశ్రామిక ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. స్వల్ప వ్యవధిలోనే మార్కెట్‌ మొత్తం వ్యాపించాయి. అయితే కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా ఆమార్కెట్‌ మూసివున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఎవరికీ ప్రాణాప్రాయం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/