అసెంబ్లీ సమావేశాలపై నాకు సమాచారం లేదు.. స్పీకర్

సభ్యుల ప్రవర్తనను వారి విచక్షణకే వదిలేస్తున్నా.. స్పీకర్ తమ్మినేని

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో నిర్వహిస్తున్నట్టు తనకు ఇంత వరకు సమాచారం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యుల తీరు వల్ల సభా సమయం ఎంతో వృథా అవుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా తనకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ… సభ్యుల ప్రవర్తనను వారి విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు.

యాక్షన్ కు రియాక్షన్ అనేది ఎప్పుడూ సరికాదని అన్నారు. సభాహక్కులకు సంబంధించి కొందరిపై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులను సభాహక్కుల సంఘానికి పంపామని చెప్పారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామివారిని తమ్మినేని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/