ఉత్తరప్రదేశ్‌‌లో తెరిచిన ప్రైవేటు పాఠశాల

చర్యలు తీసుకుంటామన్న అధికారులు

Private School In UP s Jalaun Conducts Classes Amid COVID 19

లకో: దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడిన విషయ తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్‌‌లోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం మాత్రం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పట్టించుకోలేదు. జలాన్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల మంగళవారం స్కూలు తెరిచింది. విద్యార్థులకు తరగతులు నిర్వహించింది. కరోనా మార్గదర్శకాలకు విరుద్ధంగా స్కూలు తెరిచిన ఆ స్కూలు యాజమాన్యం సంబంధిత నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. స్కూలుకు హాజరైన విద్యార్థులెవరూ మాస్కులు ధరించలేదు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఏ మాత్రం పాటించలేదు.

స్కూలు పిల్లలంతా పక్కన పక్కనే కూర్చుకున్నారు. తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా పట్ల ఏ మాత్రం జాగ్రతలు తీసుకోకుండా తమ పిల్లలను స్కూలుకు పంపారు. మరోవైపు ఈ విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు ఆ ప్రైవేట్ స్కూలు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు ఉల్లంఘించి స్కూలు తెరిచిన ఆ ప్రైవేట్ పాఠశాల మేనేజర్, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాథమిక విద్యాశాఖ అధికారి ప్రేమ్‌చంద్ తెలిపారు. కాగా పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/