ద‌శాబ్దాల క‌ల సాకార‌మైందిః సీఏం జ‌గ‌న్

CM Jagan launched Veligonda project

అమరావతిః సిఎం జగన్‌ వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఘ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. దశాబ్దాల క‌ల సాకార‌మైనందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. అద్భుత‌మైన ప్రాజెక్ట్ పూర్తి కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాప‌న చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 15.25 ల‌క్ష‌ల మంది తాగునీటి స‌మ‌స్య తీరడ‌మ‌నేది హ‌ర్షించ‌ద‌గిన‌దిగా చెప్పుకొచ్చారు. అంతేగాక వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్ర‌కాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప‌రిధిలోని మెట్ట ప్రాంతాల‌కు 4.47ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని సీఏం తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అంటూ సీఎం జగన్ చెప్పారు. 15.25 లక్షల మంది తాగునీటి సమస్య ఈ ప్రాజెక్టు ద్వారా తీరుతుందని సీఎం జగన్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం జగన్ వెల్లడించారు.