మెట్రో అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hyderabad Metro Rail
Hyderabad Metro Rail

తెలంగాణ లో మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా మెట్రో ట్రైన్స్ ఎక్కే వారి సంఖ్య బాగా తగ్గిందని..ఇలా అయితే మెట్రో ను నడపలేమని..చెప్పి మెట్రో ను అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో ఆర్‌ శంకర్‌రామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఫై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మెట్రోను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చని, వారి ఆస్తిని వారు అమ్ముకుంటామంటే అడ్డుకునేందుకు తామెవరిమని ప్రశ్నించారు. ఉచిత బస్ స్కీంతో హైదరాబాద్ మెట్రో లాస్ అవుతుందని L&T అమ్ముకుంటాం అన్న కామెంట్స్ పై స్పందించడానికి ఇష్టపడని సీఎం రేవంత్… అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు? రియాక్షన్ ఇచ్చారు.