మోడీ లాంటి నాయకుడు పాకిస్థాన్‌కు కావాలిః పాక్ అమెరికన్ వ్యాపారవేత్త

A leader like Modi should come to Pakistan: Pakistani American businessman

న్యూయార్క్‌ః భారత ప్రధానిగా మూడోసారీ నరేంద్ర మోడీయే ఎన్నికవుతారని పాక్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌ అన్నారు. అలాంటి బలమైన నాయకుడు ఉండటం యావత్ ప్రంచానికి మంచి చేస్తుందని పేర్కొన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పాకిస్థాన్లోనూ సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే ఇలాంటి నాయకుడొకరు రావాలని సాజిద్‌ ఆకాంక్షించారు.

మోడీ అద్భుతమైన నాయకుడు అని సాజిద్ తరార్ అన్నారు. పుట్టుకతోనే మోడీ లీడర్‌ అని, ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు, మొత్తం ప్రపంచానికీ మంచి చేస్తుందని ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించి, తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని అని, తమకూ అలాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నామని కితాబిచ్చారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తారన, శాంతియుత వాతావరణం ఇరుదేశాలకూ మంచిది అని సాజిత్ తరార్‌ అభిప్రాయపడ్డారు. ‘మోడీ ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో భారత పురోగతి అత్యద్భుతం. ఆ దేశ విజయాన్ని అందరూ చెప్పుకొంటారు. భవిష్యత్తులో ప్రతిఒక్కరూ భారత ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.