రెబెల్ స్టార్ ప్రభాస్ కార్ కు ఫైన్ వేసిన ట్రఫిక్ పోలీసులు

ఈ మధ్య సినీ ప్రముఖుల కార్లకు వరుసపెట్టి ఫైన్ లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయిన సరే..వదిలిపెట్టకుండా ఫైన్ లు విధిస్తున్నారు. ముఖ్యంగా కార్లపై స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ కార్లకు ఫైన్ విధించగా..తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ కారులకు ఫైన్ విధించారు.

శనివారం బంజారాహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనికీలు చేస్తుండగా..అటుగా బ్లాక్ స్టికర్ తో కార్ రావడం తో దానిని ఆపి చూడగా..బ్లాక్ స్టిక్కర్ తో పాటు నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేకపోవడం తో ట్రఫిక్ పోలీసులు కార్ యజమాని ఎవరా అని ఆరా తీయగా అది ప్రభాస్ కార్ గా తేలింది. బ్లాక్ స్టికర్ ను తొలగించి , రూ. 1450 ఫైన్ విధించారు. తనికీలు చేసే సమయంలో కారులో ప్రభాస్ లేరు. డ్రైవర్ మాత్రం ఉన్నారు. రీసెంట్ గా నాగ చైతన్య , అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ , మంచు మనోజ్ , త్రివిక్రమ్ లకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం జరిగింది.