సమంత రోజు చేసే పనులేంటో తెలుసా..?

Samantha record on social media
Samantha record on social media

నటి సమంత ..అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. కేవలం హీరోయిన్ గానే కాక ఐటెం సాంగ్స్ లలో కూడా చిందులేస్తూ అలరిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదొక అప్డేట్ ఇస్తూ..ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా తన రోజువారీ అలవాట్లపై ఓ మీడియాతో పంచుకుంది. ప్రతి రోజు ఏడు పనులు మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది.

  1. నేను రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేస్తాను. అదే నాకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది.
  2. ప్రతీ రోజు ఉదయం డే గురించి ముందే ఆలోచిస్తాను. ఈ రోజంతా ఎలా ఉండబోతోందనేది అంచనా వేసుకుంటాను. ఏయే పనులు చేయాలో బేరీజు చేసుకొని డే ప్రారంభిస్తాను. అదే నాలో నూతనోత్సాహం నింపుతుంది.
  3. నేను తీసుకునే ఆహారం పూర్తిగా మొక్కల ఆధారితమైనది. శాకాహారి జీవనశైలిని స్వీకరించడం వ్యక్తిగతంగా నాకు చాలా స్వేచ్ఛనిస్తుంది. నేను పూర్తి వేగన్‌గా మారిపోయాను.
  4. నాకు సానుభూతి ఎక్కువే. నా పర్సనల్, సినీ కెరీర్‌లో నాకు అదే చాలా ఉపయోగపడింది. మరింత బాధ్యతాయుతంగా ఉండటానికి కారణమైంది. ఎదుటివారిని నిందించకుండా ఉంటూ సమస్యల పరిష్కారాలను కనుగొనడం సులువు చేసుకుంటాను. నా సానుభూతిని మరింత పెంచుకోవడానికి, నేను ప్రతిరోజూ ఏదో ఒక పనిని స్పృహతో చేస్తాను. నా ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం లేదా పిల్లలతో సమయం గడపడం వల్ల నాలోని బలం రెట్టింపవుతుంది.
  5. ఒక నది రాయిని చీల్చుతుంది. అది దాని శక్తి వల్ల కాదు, దాని పట్టుదల వల్ల అని జిమ్ వాట్కిన్స్ అన్నారు. నేను పాటించే మంత్రం అదే. నేనెప్పుడూ నిరాశ చెందను. ఏదైనా సాధ్యం అని ప్రతిరోజూ సవాలుతో కూడిన పనులు చేస్తాను. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేందుకు ఇది ఎంతగానో సాయపడుతుంది.
  6. నేను నాతో మాత్రమే పోటీ పడుతూ నా చుట్టూ ఉన్నవారి కంటే నన్ను నేను బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నా హద్దులను నేనే చెరిపేసుకుంటాను. ఎవ్వరితోనూ పోటీ పడను. జిమ్, సెట్ ఇలా ఎక్కడైనా సరే నన్ను నేను ముందుకు నడిపించుకునేలా చూసుకుంటాను.
  7. గదిలో తెలివైన వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిరోజూ నాకు ఏదైనా కొత్త విషయాలను నేర్పించగల వ్యక్తులతో కాస్త సమయం గడుపుతాను. ఎప్పటికప్పుడు నన్ను డెవలప్ చేసుకునేందుకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను అని చెప్పుకొచ్చింది.