నేడు వైఎస్సార్ చేయూత నిధులు రిలీజ్

వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా నేడు నాలుగో విడత నిధులను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75వేల సాయం అందనుంది.

సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు కశింకోట మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు.

11.20 గంటలకు వేదికపై మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు గంట పాటు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్‌ నొక్కి ప్రారంభిస్తారు.