నేడో, రేపో ఢిల్లీకి సీఎం రేవంత్?

Telangana cabinet was inaugurated under the chairmanship of CM Revanth

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్ర నేత సోనియాగాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజో, రేపో ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆవిర్భావ వేడుకల్లో సోనియాను సన్మానించాలని కేబినెట్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ రోజు పలు కీలక నిర్ణయాలను ఈ సర్కార్ ప్రకటించనుందని తెలుస్తుంది. రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం విడుదల చేయనుంది. అలాగే ప్రభుత్వ అధికారిక చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి రూపాన్ని సైతం ఆవిష్కరించనుంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సైతం ఈ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. అందుకోసం జాబితాను ప్రభుత్వం సిద్దం చేసే పనిలో నిమగ్నమైంది.