పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు

Police search for Pinnelli.. EC orders for arrest

మాచర్ల YCP అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు శేషగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హైకోర్టు ఆదేశాలున్నా పిన్నెల్లిపై మరో తప్పుడు కేసు పెట్టారని వైసీపీ మండిపడుతోంది.

ఇదిలా ఉంటె పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం పలు ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల వెళ్లవద్దని పిన్నెల్లిని ఆదేశించింది. అయితే నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఇక, కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. కేసు గురించి సాక్షులతో కూడా మాట్లాడరాదని ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. అదే సమయంలో, పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని… ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ సీఈవోని ఆదేశించింది.