ప్రపంచవ్యాప్తంగా కోటి 50 లక్షలు దాటిన కరోనా కేసులు

53 lakh corona cases
Corona cases worldwide

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. బాధితుల సంఖ్య కోటి 50 లక్షలు దాటింది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,94,630 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,19,520 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 91,10,972 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 40,28,569 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,44,953 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,86,583 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/