2020 ‘దాదాసాహెబ్ ఫాల్కే’ (తెలుగు)అవార్డులు
బెస్ట్ మూవీగా ‘జెర్సీ’, బెస్ట్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి, ఉత్తమ నటిగా రష్మిక ,మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అక్కినేని నాగార్జున

2020 ఏడాదికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరీలో బెస్ట్ మూవీగా జెర్సీ..,. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును యంగ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి దక్కించుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీకిగాను నవీన్‌కు ఈ అవార్డు దక్కింది.
ఉత్తమ నటిగా రష్మిక మందానా ఎంపికైంది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటనకుగాను ఆమెకు ఈ అవార్డు రావడం విశేషం.
భారీ బడ్జెట్‌తో ‘సాహో ‘మూవీని తెరకెక్కించిన సుజీత్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో ‘ వంటి మ్యూజికల్ హిట్‌తో అభిమానులను అలరించిన థమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకోనున్నాడు.
ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/