నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించండి..గవర్నర్
ఏపి ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఏపి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ను కలిసి తనను మళ్లీ ఏపి ఎస్ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/