నేడు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ మంగళవారం యాదాద్రిని సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. పూర్తికావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను సీఎం తెలియజేస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/