వైఎస్‌ వివేకాకు నివాళులర్పించిన సునీత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా పులివెందులలోని ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి వివేకా పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేశారు.

మరోవైపు కడపలోని జయరాజ్‌ గార్డెన్‌లో నేడు వివేకా వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, వైఎస్‌ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరుకానున్నారు. వైఎస్ వివేకానంద 5వ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన కూతురు సునీత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వివేకా ఆత్మీయులతో ఈరోజు భేటీ కానున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలు వస్తున్నాయి.