జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌ భేటీలో గందరగోళం

ఎంఐఎం, బిజెపిల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు

GHMC Council meeting
GHMC Council meeting

హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌ సమావేశంలో ఇరు వర్గాల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరాయి. దీంతో ఒక్కసారిగా సమావేశం జరిగే వాతావరణం వేడెక్కింది. ఈ సమావేశంలో ఎంఐఎం బిజెపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అవినీతికి పాల్పడుతోందని ఎంఐఎం నేతలు మండిపడ్డారు. స్పోర్ట్స్ పేరుతో అవినీతి జరుగుతోందని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల్లో వేసిన జరిమానాలను పేదలు ఎలా కడతారని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సీఏఏపై ఎంఐఎం సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/