పిడుగురాళ్ల లో దారుణం : విద్యార్థిని ఫై టీచర్ లైంగిక వేదింపులు

పిడుగురాళ్ల లో దారుణం : విద్యార్థిని ఫై టీచర్ లైంగిక వేదింపులు

విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్..కామాంధుడిగా మారాడు. స్కూల్ కు వచ్చే విద్యార్థిని ఫై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు ఆ కామాంధుడి వేదింపులు ఎక్కువ అవుతుండడం తో ఆ విద్యార్థిని స్కూల్ కు వెళ్లానని మారాం చేసింది. ఈ ఘటన పిడుగురాళ్ల లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఫై టీచర్ వేదింపులు చేయడం మొదలుపెట్టాడు. దసరా సెలవులు ముగిసిన తర్వాత స్కూల్ కి వెళ్ళమంటే ఆ విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తనను ఓ టీచర్ వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులతో వాపోయింది. ఈ విషయం తెలుసుకొని ఆగ్రహంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్థానికులతో కలిసి స్కూల్ కి వెళ్ళారు. అక్కడే ఉన్న టీచర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ కీచక టీచర్ ను పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై స్థానికులు సీరియస్ అవుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.