మునుగోడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి

Campaigning of major parties in Munugoda from today

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను శనివారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పరిశీలించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం మునుగోడు లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పర్యటించారు.

మునుగోడు మండలం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంట నల్గొండ కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. కాగా.. యుగ తులసి పార్టీ అభ్యర్థి రోడ్డు రోలర్ గుర్తు మార్పు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అప్పటి ఆర్వో జగన్నాథ్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకే రోడ్డు రోలర్ గుర్తుకు బదులు బేబీ వాకర్ గుర్తు కేటాయించారని విమర్శలు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ… జగన్నాథ్ రావును సస్పెండ్ చేసి మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు మునుగోడు ఆర్వో బాధ్యతలు అప్పజెప్పింది.