ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్

ఒమిక్రాన్ వైరస్ వరల్డ్ వైడ్ గా రోజు రోజుకు విజ్ర్బిస్తుంది. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా బంగాల్లో ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ సోకింది. బాలుడు అబుదాబి నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బంగాల్‌కు వచ్చినట్లు చెపుతున్నారు. ప్రస్తుతం చిన్నారి ముర్షిదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మహారాష్ట్రంలో నలుగురికి ఒమిక్రాన్ సోకింది. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 32కు చేరినట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ తాజాగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 64కు చేరింది.
మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై మరోసారి స్పందించింది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్నట్లు, 77 దేశాల్లో ఆ వేరియంట్‌కు చెందిన కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను అంచనా వేయడంలో విఫలం అయ్యామని, ఒమిక్రాన్ వల్ల స్వల్ప తీవ్రత ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.