తెలంగాణ రైతులకు భారీ షాక్ ఇవ్వబోతున్న కేసీఆర్ సర్కార్

cm kcr

ఇప్ప్పటికే యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని తెలిపిన సర్కార్..ఇప్పుడు మరోషాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. యాసంగి లో వరి పంట వేసే రైతులకు రైతు బంద్ కట్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. వరి పంట సాగు చేయని రైతులకే.. అంటే వరి స్థానంలో ఇతర పంటలు వేసిన రైతులు కే రైతుబంధు ఇచ్చే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం సూచనలు చేసినప్పటికీ తెలంగాణ రైతాంగం పూర్తిగా… వరి ధాన్యాన్ని పండిస్తు ఉండడంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు రైతుబంధు పై సీఎం కేసీఆర్.. సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ కేసీఆర్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే రైతుల నుండి వ్యతిరేకత రావడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే వరి కొనుగోలు విషయంలో సర్కార్ ఫై రైతులు ఆగ్రహం గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రకటన చేస్తే మరింత వ్యతిరేకత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేశారు. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వ‌నపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశ‌న‌గ‌ పరిశోధన కేంద్రం, క‌ర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు.