అజ్మీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు..సిఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఆజ్మీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ముస్లింల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాల్లో స‌మ‌ర్పించే చాద‌ర్‌(గిలాఫ్‌)కు సిఎం కెసిఆర్ న‌మ‌స్క‌రించి.. అజ్మీర్‌కు పంపారు. ద‌ర్గాలో స‌మ‌ర్పించేందుకు ప్ర‌త్యేకంగా రూపొందించిన చాద‌ర్‌ను సీఎం కేసీఆర్ ముందు ఉంచి, ముస్లిం మ‌త పెద్ద‌లు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. తెలంగాణ రాష్‌ర్టం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్య‌వ‌సాయం రంగం పురోగ‌మించాల‌ని, కెసిఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంగా, ప‌రిపూర్ణ జీవితం గ‌డ‌పాల‌ని ముస్లిం మ‌త పెద్ద‌లు ప్రార్థించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/