వ‌ర‌ద బాధితుల కోసం నిత్యావ‌స‌రాలు సేక‌రించిన సీత‌క్క‌

స‌హాయం చేయ‌ని వారికి సంతృప్తి ద‌క్క‌బోదంటూ కామెంట్‌

seethakka

వరంగల్‌ః కాంగ్రెస్ మ‌హిళా నేత‌, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాల‌ పంపిణీ సరఫరా చేస్తున్నారు. వ‌ర‌ద బాధితుల స‌హాయం కోసం వివిధ సంస్థ‌ల నుంచి నిత్యావ‌స‌రాలు సేక‌రించిన సీత‌క్క… ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు వెళ్లారు. వ‌ర‌ద బాధితుల‌కు తన వెంట తీసుకెళ్లిన దుప్ప‌ట్లు, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సీత‌క్క… దానికి సుదీర్ఘ కామెంట్‌ను కూడా జ‌త చేశారు.

మీరెంత స‌హాయం చేసినా సంతృప్తి క‌ల‌గ‌క‌పోవ‌చ్చు కానీ… ఏ స‌హాయం చేయ‌కుంటే మాత్రం సంతృప్తి అన్న‌దే ద‌క్క‌దు అంటూ ఆమె పేర్కొన్నారు. త‌న పిలుపున‌కు స్పందించి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన ఆయా సంస్థ‌ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/