ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్‌

ఛాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిందన్న కెటిఆర్

minister-ktr

హైదరాబాద్‌ః ఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్‌తో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.