అసోంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Narendra Modi launches initiatives in Assam.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి అసోంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అసోంలోని ధుబ్రీ, మేఘాలయలోని ఫుల్బరి మధ్య వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..అసోం, మేఘాలయ మధ్య ఉన్న దూరం బాగా తగ్గిపోతుందని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గం 250 కిలోమీటర్లు ఉండగా భవిష్యత్తులో ఇది 19-20 కిలోమీటర్ల మధ్యే ఉంటుందన్నారు. రెండు ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ఈ వంతెన ద్వారా అసోం, మేఘాలయ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉండటం వల్ల అసోం అభివృద్ధితోపాటు ఈ ప్రాంత భౌగోళిక, సాంస్కృతిక అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/