ఏపిలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 25న నోటిఫికేషన్

అమరావతి: ఏపిలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 4న ఆఖరు తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. మార్చి 15న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/