సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి

టిఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిఎం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలను మనమే గెలుస్తున్నామని అన్నారు.సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌కు బిజెపి పోటి అనే అపోహలు వద్దని సిఎం కెసిఆర్‌ మనకు ఎవరితోనూ పోటీ లేదని చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ తో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. పాత, కొత్త నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని… అవసరమైన చోట మంత్రులు ప్రచారం చేస్తారని తెలిపారు.

TRS Ministers
TRS Ministers


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/