మున్సిపల్‌ రిజర్వేషన్ల తొలి దశ ప్రక్రియ పూర్తి

municipal elections telangana
municipal elections telangana

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల తొలి విడత ప్రక్రియ పూర్తి అయింది. నగర, మున్సిపాలిటీల్లోని ఆయా వార్డులకు సంబంధిత రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కాగా ఈ ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్‌సి, ఎస్‌టిల జనాభా ఒక శాతానికంటే తక్కువగా ఉన్నా కార్పొరేషన్లలో ఒక వార్డు, మున్సిపాలిటీల్లోనూ ఒక వార్డును రిజర్వ్‌ చేశారు. మిగతా స్థానాల్లో 50 శాతం మించకుండా బిసీలకు కేటాయించారు. అయితే అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు సగం సీట్లను కేటాయించారు. 10 కార్పొరేషన్లలో 385 కార్పోరేటర్‌ పదవులు, 120 మున్సిపాలిటీల్లో 2727 కౌన్సిలర్‌ పదవుల రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ మేరకు పురపాలకు శాఖ రిజర్వేషన్ల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపింది. అయితే ఇందులో కార్పోరేషన్ల మేయర్‌, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ల పదవుల రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా ఇవాళ సాయంత్రానికి పూర్తి కానుంది. ఏ వార్డుకు ఏ రిజర్వేషన్‌ ఇవ్వనుందో రేపు వెల్లడిచంనుంది. బిసీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లు ఆదివారం నాడు ఖరారు చేయనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/