వరంగల్‌ నగరానికి త్వరలో మెట్రో రైలు

metro rail
metro rail

వరంగల్‌: ఓరుగల్లు సిగలో మెట్రో మణిహారం చేరనుంది. మంత్రి కేటీఆర్‌ చొరవతో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు మహారాష్ట్రకు చెందిన మెట్రో రైలు ప్రతినిధులు బుధవారం నగరానికి వచ్చారు. వరంగల్‌ నుంచి కాజీపేట వరకు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు కమిషనర్‌ పమేలా సత్పతితో బల్దియా కార్యాలయంలో చర్చలు జరిపారు. రూ.18వేల కోట్లకు పైగా అంచనాతో నిర్మించే ఈ ప్రాజెక్టుపై త్వరలో డీపీఆర్‌ను సిద్ధ చేస్తామని ప్రతినిధులు రాజీవ్‌, రామ్‌ కమిషనర్‌కు చెప్పారు. మెట్రో నిర్మాణం జరిగితే నగరానికి కొత్త కళ సంతరించుకోనుంది. మహారాష్ట్రకు చెందిన మహా మెట్రో సంస్థ ప్రతినిధులు బుధవారం వరంగల్‌ నగరానికి వచ్చారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతితో చర్చలు జరిపారు. హన్మకొండలోని కుడా కార్యాల యంలో సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్‌ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామం తో వరంగల్‌ మహానగరంలో మెట్రో రైలు కోసం కీలక అడుగు పడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/