చైతు – సమంత విడాకుల వార్తల ఫై శ్రీ రెడ్డి కామెంట్

చైతు - సమంత విడాకుల వార్తల ఫై శ్రీ రెడ్డి కామెంట్

నాగ చైతన్య – సమంతలు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. విడాకుల వార్తల ఫై సామ్ ఇన్డైరెక్ట్ గా కొట్టిపారేసినప్పటికీ విడిపోతున్నారనే వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ తరుణంలో శ్రీ రెడ్డి ఈ పుకార్ల ఫై కామెంట్స్ చేసింది.

సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య అక్కినేని బెస్ట్ కపుల్. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటారు. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. వారి బ్రేకప్ గురించి రూమర్లు వ్యాప్తి చేయవద్దు అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె..లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ రిలీజ్, ట్రైలర్ లింకును షేర్ చేసి నాగచైతన్య ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సమంత రిప్లై ఇస్తూ.. విన్నర్.. లవ్ స్టోరి సినిమా యూనిట్‌కు, సాయిపల్లవికి బెస్టాఫ్ లక్ అంటూ ట్వీట్‌ చేసింది. అయితే తన ట్వీట్‌పై సమంత స్పందించడంపై నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. తనకు, సాయిపల్లవికి, చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియచేసినందుకు చైతూ హ్యపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా థ్యాంక్యూ సామ్ అంటూ నాగచైతన్య రిప్లై ఇచ్చారు.