నిజం మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు

చేసిన తప్పుల నుండి ఎవరు తప్పించుకోలేరని అన్నారు అది నిజమే!

buddha venkanna
buddha venkanna

అమరావతి: వైఎస్సాఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టిడిపి నేత బుద్ధా వెంకన్న సైటైరికల్‌ ట్వీట్లు చేశారు. ఇంత కాలానికి మీరు ఒక నిజం మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు. చేసిన తప్పుల నుండి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు అది నిజమే నిన్నే సిబిఐ కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తప్పులు చేసి తప్పించుకొని తిరగడం కాదు ముందు కోర్టు విచారణకు హాజరవ్వండని కోర్టు వారు చెప్పారు కదా ఇక బయలు దేరండని బుద్ధా వెంకన్న అన్నారు. ఇంకా విశాఖ, విజయనగరం జిల్లాలో భూములు కొట్టేసే పని విజయవంతంగా పూర్తి చేశారు. ముందు చేసిన పాత తప్పులకు మీరు, జగన్‌మోహన్‌ రెడ్డి గారు శిక్ష అనుభవించండి. కొత్త తప్పుల నుండి ఎలాగో తప్పించుకోలేరు దానికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం విజయసాయిరెడ్డి గారు అని బుద్ధా వెంకన్న ట్వీట్‌ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/