కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులర్పించి సిఎం ‌

cm-kcr-pay-tributes-to-konda-laxman-bapuji

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కెసిఆర్‌ గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా, ముల్కీ వ్య‌తిరేక ఉద్య‌మంతో పాటు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు అని సిఎం పేర్కొన్నారు. ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సిఎం కెసిఆర్ అన్నారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, నిరంజ‌న్ రెడ్డి కూడా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ సేవ‌ల‌ను మంత్రులు గుర్తు చేసుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/