చిత్రసీమకు మరో షాక్..రేపటి నుంచి తెలుగు సినీ కార్మికుల సమ్మె

కరోనా దెబ్బకు చిత్రసీమ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద సినిమాలు అనే తేడాలు లేకుండా అన్ని సినిమాలు కోట్లలో నష్టపోయాయి. కరోనా ఉదృతి తగ్గడం , థియేటర్స్ ఓపెన్ కావడంతో అంత సెట్ అయ్యిందని అనుకున్నారు కానీ ఏపీ లో టికెట్ ధరలు చిత్రసీమకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అది కూడా సెట్ అవ్వడం తో ఒక అనుకున్నారు.

కానీ మునపటి మాదిరి ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు. కరోనా దెబ్బకు అంత ఓటిటి కి అలవాటు పడడం, టికెట్ ధర ఎక్కువగా ఉండడం తో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం పూర్తిగా తగ్గించేశారు. అగ్ర హీరోల సినిమాలు వస్తే మొదటి , రెండో రోజు అభిమానులు వస్తున్నారు. ఇక మూడో రోజు నుండి థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమా కు నెగిటివ్ వస్తే రిలీజ్ రోజు సాయంత్రం నుండే థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆచార్య , రాధే శ్యామ్ తదితర చిత్రాలకు అలాగే జరిగింది. దీంతో భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎలా ముందుకు వెళ్దాం అని నిర్మాతలు ఆలోచిస్తుండగా..ఇప్పుడు సినీ కార్మికులు పెద్ద షాక్ ఇచ్చారు.

తమ వేతనాలను పెంచాలంటూ రేపటి నుండి సమ్మె కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపు నిచ్చారు. వేతనాలు పెంచే వరకూ షూటింగ్‌లు జరగవని సినీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని వస్తువులు విపరీతంగా పెరిగాయి. రోజు ఖర్చులు పెరిగాయి. దీంతో చాలీచాలని జీతాలతో గడవడం కష్టంగా మారింది. అందుకే తమ వేతనాలు పెంచాలని కోరుతున్నాం అంటూ సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సినీ పెద్దలు వారితో మాట్లాడి సమస్య పరిష్కారిస్తారా..లేదా అనేది చూడాలి.