బాధితుల‌ను అన్నివిధాల ఆదుకుంటాం..ప్రధాని

ముంబయి ప్రమాద మృతులకు ప్రధాని మోడి సంతాపం

PM Modi expresses grief over building collapse in Bhiwandi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని బీవండిలో భవనం కూలిన ఘటనలో మృతులకు ప్రధాని మోడి సంతాపం తెలిపారు. వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవ‌నం కూలిపోవ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. బాధితుల‌ను అన్నివిధాల ఆదుకుంటామ‌ని చెప్పారు. వారికి కావాల్సిన స‌హాయం అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

కాగా ముంబయిలోని బీవండీలోని కాంపౌండ్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలవగా మరో 25 మంది వరకు శిథిలాల కింది చిక్కుకుని పోయిన విషయం తెలిసిందే. ఓ చిన్నారి స‌హా 31 మందిని స్థానికులు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ర‌క్షించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/